రాష్ట్ర‌ప‌తి రేసులో సుష్మా స్వ‌రాజ్?

0
403
sushma swaraj in president competation

Posted [relativedate]

sushma swaraj in president competation
రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో త‌ర్వాతి ప్రెసిడెంట్ ఎవ‌రన్న‌దానిపై జోరుగా చర్చ జ‌రుగుతోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ శ్రేణులు మాత్రం ఆ అర్హ‌త రాజ‌కీయ దిగ్గ‌జం ఎల్కే అద్వానీకే ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌నే త‌ర్వాతి రాష్ట్ర‌ప‌తి అవుతార‌ని ఘంటాప‌థంగా చెబుతున్నాయి. అయితే కేంద్ర‌ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న లీకులు వేరేలా ఉన్నాయి. సుష్మా స్వరాజ్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సుష్మా స్వ‌రాజ్ పేరు తెర‌పైకి రావ‌డం వెన‌క ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అద్వానీ వ‌య‌స్సు ఇప్పుడు 90 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి అయితే వృద్ధాప్యం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా ప్ర‌ధాని మోడీపై త‌న‌కున్న కోపంతో కొన్ని విష‌యాల్లో ఇబ్బందులు పెట్టే అవ‌కాశ‌ముంద‌ని… మోడీ స‌న్నిహితులు అనుమానిస్తున్నారు. అందువ‌ల్ల ఆయ‌న పేరును త‌ప్పించ‌డానికి ఆస్థాయిలో ఉన్న మ‌రో నేతవైపు మొగ్గు చూప‌తున్నారు. బీజేపీలో అద్వానీ త‌ర్వాత ఆస్థాయి ఉన్న సుష్మా స్వ‌రాజ్ ఒక్కరే.

ప్ర‌ధానిగా మోడీ తెరపైకి రాక‌ముందు ఒక‌ద‌శ‌లో సుష్మానే ప్ర‌ధాని అభ్య‌ర్థి అని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా మోడీ రేసులోకి వ‌చ్చారు ప్ర‌ధాని అయిపోయారు. సుష్మా కేంద్ర‌మంత్రి ప‌ద‌వితోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యంలో మోడీ కూడా సుష్మా ప‌ట్ల సానుభూతితో ఉన్నార‌ట‌. స‌రైన స‌మ‌యంలో ఆమెకు మంచి అవ‌కాశం ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నార‌ని టాక్. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఆమెను ఎంపిక చేయ‌డం ద్వారా కృతజ్ఞ‌త‌ను చాటుకోవాల‌ని మోడీ ఆలోచిస్తున్నార‌ట‌.

అంతేకాకుండా సుష్మా స్వ‌రాజ్ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అయితే..అద్వానీ వ‌ర్గం కూడా వ్య‌తిరేకించే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఆమె అద్వానీకి అత్యంత స‌న్నిహితురాలు. ఇలా అటు బీజేపీ.. ఇటు ఆర్ఎస్ఎస్ .. అంద‌రి కంటే మించి అద్వానీ… ఇలా అంద‌రినీ శాంతింప‌జేసి…తాను అనుకున్న‌ది చేయాల‌న్న‌ది మోడీ ప్లాన్ అని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే సుష్మా స్వ‌రాజ్ రాష్ట్ర‌ప‌తి కావ‌డం ఖాయ‌మ‌ని మోడీ వ‌ర్గం బ‌లంగా న‌మ్ముతోంది. చూడాలి మ‌రి… అద్వానీని కాద‌ని… వేరొక‌రిని ఆ ప‌ద‌వికి ఎంపిక చేస్తే ఇస్తే… ఎలాంటి ప‌రిణామాలు ఎదురవుతాయో!!!

Leave a Reply