రాష్ట్ర‌ప‌తి రేసులో ముందున్న సుష్మా!!!

0
308
sushma swaraj is front in govenor competation

Posted [relativedate]

sushma swaraj is front in govenor competation
రాష్ట్ర‌ప్ర‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం ముగియ‌నుండ‌డంతో … త‌ర్వాత ఎవ‌రు అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నా… ఒక‌రిద్ద‌రికే ఎక్కువ అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్, బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్, జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఈ లిస్టులో సుష్మాకే ఎక్కువ ఛాన్స్ ఉంద‌ని టాక్.

బీజేపీలో బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఎదిగిన సుష్మాస్వ‌రాజ్ గ‌తంలో లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. ఒక‌ద‌శ‌లో మోడీతో పాటు ఆమె పేరు కూడా ప్ర‌ధాన‌మంత్రి రేసులో వినిపించింది. కానీ ఆ ఛాన్స్ మోడీకి ద‌క్క‌డంతో… ఆ త‌ర్వాత కేంద్ర‌ విదేశాంగ మంత్రి అయ్యారు. అక్క‌డా త‌న‌దైన శైలిలో ప‌నిచేసుకుంటూ మంచిపేరే తెచ్చుకున్నారు. అయితే సుష్మాకు అంత‌కంటే మంచిప‌ద‌వి ద‌క్కాల్సింద‌ని చాలామంది బీజేపీ సీనియ‌ర్ నేత‌ల అభిప్రాయం. బీజేపీ వాయిస్ బ‌లంగా వినిపించ‌డంలో గానీ… ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రావ‌డంలో గానీ ఆమె పాత్ర కూడా ఉంద‌ని అంగీక‌రించేవారే ఎక్కువ‌.

అటు ప్ర‌ధాని మోడీ కూడా … సుష్మాస్వ‌రాజ్ త‌గిన న్యాయం చేయ‌లేకపోయామ‌నే భావ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను రాష్ట్ర‌ప‌తిని చేసే విష‌యంలో సీరియ‌స్ గానే ఉన్నార‌ట‌. ఇందుకోసం ఇప్ప‌ట్నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో సుష్మా పేరు తెర‌పైకి తేవ‌డం ద్వారా అద్వానీకి చెక్ పెట్టాల‌న్న‌ది ఆయ‌న వ్యూహ‌మ‌ట‌. ఎందుకంటే సుష్మా పేరు తెర‌పైకి వ‌స్తే… అద్వానీ కూడా కాద‌నే ప‌రిస్థితి ఉండ‌దు. ఎందుకంటే అద్వానీకి ఆమె స‌న్నిహితురాలు. పైగా ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సుష్మాకు ఆమోదం ఉంటుంది. సీనియ‌ర్లంతా ఆమె వైపే మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. అన్నింటికి మించి బీజేపీతో పాటు ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల‌తోనూ సుష్మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆమె ప్రెసిడెంట్ అయితే… బీజేపీకి ప్ర‌త్య‌ర్థిగా ఉన్న పార్టీలు సైతం ఆమెను బ‌ల‌ప‌ర్చే అవ‌కాశాలే ఎక్కువ‌.

గ‌త కొంత‌కాలంగా సుష్మాస్వ‌రాజ్ ఆరోగ్యం బాగాలేదు. ఆమె విశ్రాంతిని కోరుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఆ కార‌ణంగా పాలిటిక్స్ నుంచి రిటైర‌య్యే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌డం కూడా అనుమానమేన‌ని టాక్. అందుకే సుష్మాకు రాష్ట్ర‌ప‌తిగా అవకాశం ఇచ్చి…. ఆమె చేసిన సేవ‌కు త‌గిన గుర్తింపు ఇవ్వాల‌ని మోడీ ఆలోచిస్తున్నార‌ట‌. ప్రెసిడెంట్ రేసులో చాలామంది నాయ‌కుల పేర్లు రేసులో ఉన్నా… ప్ర‌ధాని మోడీ మొగ్గు సుష్మా వైపేనని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా ఏ ర‌కంగా చూసినా ఇక సుష్మా రాష్ట్ర‌ప‌తి కావ‌డం ఖాయ‌మన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలే నిజం కావాల‌ని ఆమె అభిమానులు బ‌లంగా కోరుకుంటున్నారు

Leave a Reply