ఎన్టీఆర్ ఏమన్నా ఫూలా..!

0
754
ntr

Posted [relativedate]

Related image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫూల్ ఎలా అవుతాడు.. అతనో స్టార్ హీరో.. మరి ఎందుకు తారక్ ను ఫూల్ అనాల్సి వచ్చింది అంటే.. అశ్వనిదత్ తనయ స్వప్నదత్ ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో వారు నిర్మించిన శక్తి సినిమా విషయాలను గురించి మాట్లాడుతూ తాము ఫ్లాప్ సినిమాకు డబ్బులు పెట్టడానికి.. ఫ్లాప్ సినిమా నటించడానికి ఎన్టీఆర్ ఏమన్నా ఫూలా.. కథగా ఉన్నప్పుడు థ్రిల్లింగ్ గా అనిపించింది. అందుకే దాని మీద కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టాం తీరా సినిమా నిరాశ పరచింది. అంతేకాని సినిమా లాస్ అవడం వల్ల తమ నిర్ణయం సరైనది కాదు అనడం తగదు అనేసింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన శక్తి భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడమే కాదు దానికి తగ్గ విమర్శలను ఎదుర్కున్నారు నిర్మాతలు. ఇక దానికి వివరణ ఇస్తూ స్వప్న దత్ ఇలా స్పందించడం జరిగింది.

ప్రస్తుతం కొత్త కొత్త నిర్మాణ సంస్థలు తమ అభిరుచికి తగ్గ సినిమాలను తీస్తూ హిట్లు కొడుతున్నారు. అయితే ఎన్నో సంచనాలను సృష్టించిన వైజయంతి మూవీస్ వారు ఇప్పుడు రేసులో వెనుకపడ్డారు. సినిమా తీసే ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నా సరే ఈమధ్య వెనక్కి తెగారు అశ్వని దత్. ఇక తన కూతుళ్లు ఇద్దరు కలిసి చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ప్రస్తుతం సావిత్రి బయోపిక్ తో నాగ్ అశ్విన్ డైరక్షన్లో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply