ఎన్నాళ్లకు స్వాతి మళ్లీ ఓకే చేసింది

0
358
swathi reentry in telugu industry after 2 years

Posted [relativedate]

swathi reentry in telugu industry after 2 yearsబుల్లితెర నుండి వెండితెరకి వచ్చి సక్సెస్ సాధించిన సెలబ్రిటీస్ లో స్వాతి పేరు ముందుంటుంది. కలర్స్ అనే ప్రోగ్రామ్ తో బుల్లితెర మీద సందడి చేసిన స్వాతి డేంజర్ సినిమాతో వెండితెర అభిమానులను కూడా అలరించింది. అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె త్రిపుర సినిమా తర్వాత తెరమరుగైంది.

ఈ సినిమా వచ్చి దాదాపు రెండు సంవ్సరాలు పూర్తైనా ఆమె తెలుగులో ఒక్కసినిమా కూడా ఒప్పుకోలేదు. ఇతర భాషల్లో బిజిగా ఉండడమే అందుకు కారణం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే త్రిపుర సినిమా ఆడకపోవడం వల్లే  స్వాతికి తెలుగులో అవకాశాలు తగ్గాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.  కాగా ఇన్నాళ్లకు మళ్లీ స్వాతి తెలుగు అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. కొత్త డైరెక్టర్ ఆదిత్య స్వాతికి ఇటీవలే మంచి రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌ కథను  వినిపించాడట. ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో స్వాతి సినిమాను ఒకే చేసినట్లు సమాచారం. ఈ మూవీలో గుంటూరు టాకీస్ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి స్వాతి ఈ సినిమాతో హిట్ కొట్టి తన స్టార్ డమ్ ని మళ్లీ కొనసాగిస్తుందేమో చూడాలి.

Leave a Reply