స్వీటికి టైమొచ్చింది..

 Posted October 16, 2016

anushka-shettyఈ మద్య అనుష్క సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో.. ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు. అయితే, వారిని డిసెంబర్ వరకు ఓపిక పట్టాలని స్వీటి రిక్వెస్ట్ చేస్తోంది. ఎందుకంటే.. డిసెంబర్ నుంచి స్వీటీ నటించిన చిత్రాలు వరుస కట్టనున్నాయి. సింగం సిరీస్ ‘సింగం3’ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగం సిరీస్ లో సూర్య-అనుష్క లది హిట్ పెయిర్. ఈ చిత్రం స్వీటి అభిమానులని అలరించడం ఖాయం.రాఘవేంద్రరావు-నాగ్ ల భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో
అనుష్క భక్తురాలిగా కనిపించనుంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి’లో సంకెళ్లకే పరితమైన అనుష్క, సీక్వెల్ బాహుబలి 2లో వీర విహారం చేయనుంది. ‘బాహుబలి ది కంక్లూజన్’ 2017 ఏప్రిల్
28న రిలీజ్ కానుంది.ఈ సినిమా త‌రువాత ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న‘భాగమతి’ కూడా నెక్ట్స్ సమ్మర్ సీజన్ లోనే విడుద‌ల కానుంది. మొత్తానికి డిసెంబర్ తర్వాత స్వీటి 4 చిత్రాలతో ప్రేక్షకులని కనువిందు చేయనుంది.

SHARE