శ్వేతా బసు ‘మిక్సర్‌ పొట్లం’ లో ఏముంది..?

0
646

Posted [relativedate]

 swetha basu hot mixture potlam movie

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సరికొత్తగా పలకరించిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌. చాన్నాళ్ల తర్వాత  ‘మిక్సర్‌ పొట్లం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. జయంత్‌-శ్వేతా బసు జంటగా నటించిన చిత్రం ‘మిక్సర్‌ పొట్లం’. సతీష్‌ కుమార్‌ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా చిత్ర విశేషాలని వివరించింది చిత్రబృందం. వినోదంతో పాటు కథలో భావోద్వేగ అంశాలుంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇందులో హాట్ బ్యూటీ
శ్వేతాబసు సువర్ణ సుందరిగా కనిపించబోతోంది. సినిమాలోనూ సెలబ్రిటీగా హాట్ హాట్ గా కనిపించనుందట. ఈ సినిమా తనకెంత పేరు తెస్తుందని చెప్పుకొంటోంది శ్వేతా. గీతాంజలి, అలీ, భానుచందర్‌, కృష్ణ భగవాన్‌, సుమన్‌, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మాధవపెద్ది సురేష్‌. లక్ష్మీ
ప్రసాద్‌, కంటె వీరన్న, లంకపల్లి శ్రీనివాస్‌ నిర్మాతలు.

Leave a Reply