APSRTC లో స్వైపింగ్ మిషన్లు…

0
301
swiping machines in apsrtc

Posted [relativedate]

swiping machines in apsrtcనగదురహిత టికెట్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు క్రెడిట్‌, డెబిట్‌, రూపే కార్డులతో టికెట్లకు చెల్లింపులు జరిపేలా భారీ సంఖ్యలో స్వైపింగ్‌ మెషీన్ల (ఈ-పాస్‌)ను వినియోగించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం 16 వేల యంత్రాలు సమకూర్చుకుంటోంది.

ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్నిరకాల బస్సుల్లో ఈపాస్‌ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగువెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో 6,190 ఈపాస్‌ మెషీన్లు వాడనున్న ఆర్టీసీ..దూరప్రాంత బస్సులో ఐదువేల వరకు వాడనుంది. బస్టాండ్లలో రిజర్వేషన్‌ కౌంటర్లతో పాటు ఏటీబీ ఏజెంట్లకు 1,434..ముఖ్యమైన స్టేజీల్లో గ్రౌండ్‌ బుకింగ్‌ సిబ్బందికి 192 యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. 2,667 యంత్రాలు సర్దుబాటు కోసం ఉంచనుంది. కార్డుతో డబ్బు చెల్లింపునకు, టికెట్‌ జారీకి ఉపయోగపడేలా కొత్త పరిజ్ఞానంతో ఒకే మెషిన్‌ తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply