కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు

Posted April 21, 2017 at 10:55

t congress leadders plan to invite harish rao in congress party130 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ. పాలిటిక్స్ ను పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ. పార్లమెంటులో సొంత పార్టీ అధిష్ఠానాన్నే ఎదిరించిన హీరోలు. ఇదీ కాంగ్రెస్ ఘనత. కానీ ఇప్పుడేమైంది. విభజన కోపంతో ఉన్న ఏపీలో అస్తిత్వం కోల్పోయిందంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలోనూ పెద్ద అవకాశాలు కనిపించడం లేదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ సభలకు జనం రావడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన బలహీనవర్గాల గర్జన చూస్తే.. కాంగ్రెస్ కొడిగడుతున్న దీపమే అని అర్థమవుతోంది.

మాజీ కేంద్రమంత్రి సర్వే మాట్లాడే సరికి.. అసలు సభలో జనం లేరు. ఖాళీ కుర్చీల్ని చూస్తూ ఆయన మాట్లాడాల్సి వచ్చింది. జనం సరే నేతలు కూడా ఆయన మాటలు వినలేదు. సర్వే స్పీచ్ ఇస్తుంటే.. వారి సొల్లు వాళ్లు చెప్పుకున్నారు. ఇదీ కాంగ్రెస్ కథ. దీనికి తోడు హరీష్ కేసీఆర్ కు వెన్నుపోటు పొడవాలని కాంగ్రెస్ నేతలు పేరాశ పడుతున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. సొంతంగా ఇల్లు కట్టలేను కానీ.. మేస్త్రీ ముందుకొస్తే కట్టి చూపిస్తా అన్నాడట ఇలాంటి వాడెవడో. ఇప్పుడు కేసీఆర్ ను ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్లు.. హరీష్ ముందుకొస్తే చెయ్యందిస్తామనడం హాస్యాస్పదంగా ఉంది.

ఇక సోనియా, రాహుల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సోనియా ప్రభ అయిపోయింది. ఆమె తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల్నే నిలబెట్టలేకపోతోంది. ఇక రాహుల్ ది గ్రేట్ గురించి ఎందుకులే.. ఆయనొస్తే ఓటమి ఖాయమని కాంగ్రెస్ నేతలే ఫిక్సయ్యారు. అలాంటిది వీరిద్దరూ కలిసి తెలగాణలో బలంగా ఉన్న కేసీఆర్ సర్కారును కూలుస్తారట. ఇంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉందా. హరీష్ కు సీఎం లక్షణాలున్నమాట నిజమే. కానీ ఆయనకు బుర్ర కూడా ఉంది. ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడ వేయాలో బాగా తెలుసు. కేసీఆర్ ఫామ్ లో ఉన్నన్నాళ్లూ హరీష్ సైలంట్ గానే ఉంటాడు. అదే ఆయన స్ట్రాటజీ. ఈ సంగతి కాంగ్రెస్ బుర్రలకు ఎప్పుడు ఎక్కుతుందో..?

SHARE