Thursday, January 27, 2022
Homelatestఓయూలో కారుకు హస్తం సవాల్

ఓయూలో కారుకు హస్తం సవాల్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంగారెడ్డి సభ విజయంతో టీకాంగ్రెస్ నేతలకు పండగొచ్చేసింది. గత ఎన్నికల్లో కేసీఆర్ ను నమ్మిన జనం.. ఈసారి ఆయన మోసపూరిత పాలనతో విసిగిపోయి తమకే పట్టం కడతారని హస్తం నేతలు కొండంత ఆశతో ఉన్నారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ కోసం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడైతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందో అక్కడే మీటింగ్ పెట్టి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో సభ పెడితే.. కేసీఆర్ కు దిమ్మ తిరిగుతుందనేది కాంగ్రెస్ ప్లాన్. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో మాట మాట్లాడకుండా వెళ్లిపోయిన కేసీఆర్ పై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని హస్తం పార్టీ భావిస్తోంది. ఆ వ్యతిరేకతను తాము ఫుల్లుగా క్యాష్ చేసుకోవాలంటే ఓయూలోనే సభ పెట్టాలని డిసైడైంది. నేతల మధ్య విభేదాలున్నా సంగారెడ్డి సభ సక్సెస్ అయిందని, కలిసి పనిచేస్తే ఓయూ సభ మాత్రం ఎందుకు విజయవంతం కాదని చర్చ జరుగుతోంది.

కేసీఆర్ నోరు విప్పలేని చోట.. తాము మాట్లాడగలిగామన్న క్రెడిట్ వస్తుందని, తెలంగాణ ప్రజల దృష్టిలో కూడా హీరోలైపోతామనేది కాంగ్రెస్ ఆలోచన. దీని సంగతి పక్కనపెడితే ఓయూలో తెలంగాణ లో ప్రతి గ్రామం నుంచి విద్యార్థి ఉంటాడు. అంటే ఓయూలో సభ విజయవంతమైతే.. ఆ మెసేజ్ పల్లెపల్లెకూ వెళుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓయూ సభను ఎలాగైనా పెట్టితీరాలని పట్టుదలగా ఉంది.

- Advertisment -
spot_img

Most Popular