టీఎస్సార్ అమాయకుడు కాదు అసాధ్యుడు…

0
338
T subbirami reddy brave man

Posted [relativedate]

T subbirami reddy brave man
టి .సుబ్బిరామిరెడ్డి తనని ఓ పారిశ్రామికవేత్తగా కన్నా ఓ కళాబంధుగా,ఆధ్యాత్మికవేత్తగా జనం గుర్తించాలని తపన పడుతుంటారు.ఆ క్రమంలో ఆయన చేసే కొన్ని ఫంక్షన్స్,అందులో ప్రకటించే అవార్డ్స్ చూస్తే చాలా మందికి ఇదంతా సీరియస్ వ్యవహారం కాదని అనిపిస్తుంటుంది.అయితే రిచ్ నెస్,గ్రాండ్ నెస్ కి అడ్రస్ లా వుండే ఆయన ఫంక్షన్స్ చూసేందుకు,అందులో పాల్గొనేందుకు సెలబ్రిటీ లు ఆసక్తి చూపిస్తారు.ఇక టీఎస్సార్ ఇచ్చే అవార్డ్స్ కన్నా దానికి వచ్చే స్టార్లని చూసేందుకు జనం ఎగబడతారు.ఆ సందడి చూసేందుకు టీవీ ప్రేక్షకులు కూడా ఇంటరెస్ట్ చూపిస్తారు.ఇక స్వామీజీలు,ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో ఆయన చేసే మహాశివరాత్రి ఉత్సవాలు కూడా ఆడంబరంగానే జరుగుతాయి.ఆ సందర్భాల్లో టీఎస్సార్ మంత్రం జపం,హావభావాలు కొంచెం శృతిమించుతున్నాయేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.ఇంత ఖర్చు పెట్టి ఈ పెద్దాయన లేనిపోని చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకని ఒక్కోసారి అనిపిస్తుంది.

అయితే తప్పులు గుర్తించినంత తేలిగ్గా ఒప్పులు కనపడవు.కనపడినా అంత తేలిగ్గా ఒప్పుకోలేము.సుబ్బిరామి రెడ్డి చేసే ఈ భారీ ఫంక్షన్స్ వల్ల దేశానికి,ప్రజలకి ఏదో గొప్ప మేలు జరుగుతుంది జరక్కపోయినా ఎంతోకొంత వినోదం ఏటా దొరుకుతున్న మాట వాస్తవం.ఈ సంవత్సరం ఆ వినోదానికి తోడు ఆ వినోద రంగంలో భారీ విజయం కూడా ఆయన ఖాతాలోనే పడింది.అదే నందమూరి,అక్కినేని వారసుల కలయిక.కారణాలు ఏమైనా బాలయ్య,నాగ్ ఒకే వేదికపై కనిపించి మనసారా మాట్లాడుకొని చాలా ఏళ్ళు అయ్యింది.తెలుగు సినీ రంగానికి రెండు కళ్ల లాంటి ఆ దిగ్గజ కుటుంబాల వారసుల్ని మళ్లీ ఒక్క దగ్గరికి చేర్చిన ఘనత మాత్రం సుబ్బిరామిరెడ్డి కి ఇవ్వాలి.ఇన్నాళ్లు అమాయకుడుగా కనిపించిన ఆయన బాలయ్య,నాగ్ తమకు వచ్చిన అవార్డ్స్ మార్చుకునేంత దాకా తీసుకెళ్లిన అసాధ్యుడు అనిపించాడు.

Leave a Reply