తాప్సీ ఖాతాలో మరోటి!

0
446

Posted [relativedate]

 taapsee chance naam shabana bollywood movie

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి బాలీవుడ్ బాగానే అచ్చొచ్చింది. తెలుగు, తమిళ్ లో కలిపి దాదాపు 20సినిమా చేసినా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ రాలేదు ఈ
ముద్దుగుమ్మకి. బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ తో పాటు చాన్సులు క్యూ కట్టాయి. ఇప్పటికే ‘చస్ మే బదూర్’, ‘బేబీ’ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ
మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పింక్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. పైగా.. ‘పింక్’లో తాప్సీ నటనకి బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.

ఇప్పుడు బాలీవుడ్ లో తాప్సీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది తాప్సీ. రానా హీరోగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం “ఘాజీ”తో పాటుగా.. ‘థడ్కా’ మూవీలో నటిస్తోంది. తాజాగా, ‘బేబీ’ సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘నామ్ షబానా’లో లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ స్టోరీ మొత్తం తాప్సీ చుట్టే తిరుగుతుందని టాక్. మొత్తానికి.. తాప్సీ బాలీవుడ్ లో పర్మినెంట్ గా తిష్టవేసేలా ఉంది.

Leave a Reply