సినిమా కష్టానికి బయటా ఏడుస్తున్న అమ్మడు ..

0
449

  taapsee crying out side pink movie

 ”పింక్” సినిమాలో అసలు తాప్సీ పోషించిన రోల్  ఏమిటి? ట్రైలర్ చూస్తే ఆమె డబ్బుకోసం మానాన్ని అమ్ముకుంది అనే సందేహం వస్తుంది. అయితే తాను మోసం చేయబడ్డానని తాప్సీ చెప్తుంటుంది. ఇటీవలే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది తాప్సి. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ”అర్దరాత్రి స్త్రీ ఒంటరిగా నడవగలిగినప్పుడే పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు.

కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? అత్యాచారాల నుంచి బయట పడినప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన  రోజు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలి” అని తాప్సీ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఆమె పింక్ సినిమాలో అత్యాచార బాధితురాలిగా నటిస్తోందట. ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు తాప్సి ఏడ్చేసిందట. ఇది షూటింగే కదా అని యూనిట్ వర్గాలు సముదాయించినా దుఖాన్ని ఆపుకోలేకపోయిందట. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ.. ఇలాంటి పర్ఫార్మెన్స్‌కు ఆస్కారమున్న సినిమాతో పెద్ద హిట్టే కొట్టేలా ఉందని అంతా అంటున్నారు.

Leave a Reply