తాప్సి మనస్సులో ఇలా ఉందా.. కష్టమే!

0
593
taapsee wants to make the Telugu Movies in recognition

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

taapsee wants to make the Telugu Movies in recognition
మంచు హీరో మనోజ్‌తో కలిసి ‘జుమ్మంది నాధం’ చిత్రంలో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ తాప్సి ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. అందులో కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి, కొన్ని సక్సెస్‌ అయ్యాయి. అయితే టైం బ్యాడో ఏమో కాని ఈ అమ్మడికి మాత్రం టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. మెల్లమెల్లగా ఈ అమ్మడి క్రేజ్‌ తగ్గిపోయింది. సినిమా అవకాశాలే రాని సమయంలో వెంటనే బాలీవుడ్‌కు ఈ అమ్మడు చెక్కేసింది. అక్కడ చిన్నా, చితక సినిమాలు చేసుకుంటూ ఈ అమ్మడు కెరీర్‌ను మళ్లీ నిలుపుకుంది.

బాలీవుడ్‌లో పర్వాలేదు అన్నట్లుగా సినిమాలు చేసిన ఈ అమ్మడు మళ్లీ తెలుగులో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యింది. కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఆనందో బ్రహ్మ సినిమాలో తాప్సికి హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చింది. ఈ సందర్బంగా ఈ అమ్మడు స్పందిస్తూ తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఎప్పుడు కూడా అభిమానమే. తనకు సినీ కెరీర్‌ను ప్రసాదించిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నేను గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు నాకు తెలుగులో సక్సెస్‌ కావాలి, ఆ సక్సెస్‌తో మళ్లీ టాలీవుడ్‌లో నేనో బిజీ స్టార్‌ను కావాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అయితే అది సాధ్యం అయ్యే పని కాదని, టాలీవుడ్‌లో తాప్సి మళ్లీ స్టార్‌గా ఛాన్స్‌లను దక్కించుకోవడం అసాధ్యం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply