బాలయ్య సినిమాలో డిజాస్టర్‌ దర్శకుడి వేలు

0
333
Mehr Ramesh has been putting all the things up to the scene during shooting from the cinema script. Talking is also about Mehr Ramesh after Balayya looks stylish. Beyaiah has to see how Mehr Ramesh gives no result.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒకటి రెండు చిత్రాలు సక్సెస్‌ అవ్వగానే మెహర్‌ రమేష్‌ స్టార్‌ దర్శకుడు అయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం మెహర్‌ రమేష్‌ దర్శకత్వం అంటేనే నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి లేదు. అందుకే దర్శకుడు మెహర్‌ రమేష్‌కు మళ్లీ ఆఫర్లు రావడం లేదు. దాంతో చేసేది లేక మునుపటి తరహాలో మళ్లీ సహాయ దర్శకుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా సినిమాల దర్శకులకు సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ డిజాస్టర్‌ దర్శకుడు బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ‘పైసా వసూల్‌’ చిత్రానికి పని చేస్తున్నాడు.

కెరీర్‌ ఆరంభంలో పూరి జగన్నాధ్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మెహర్‌ రమేష్‌, కన్నడంలో ‘ఆంధ్రావాలా’ రీమేక్‌కు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. పూరి జగన్నాధ్‌ దాదాపు అన్ని ప్రాజెక్ట్‌లో కూడా మెహర్‌ పాత్ర ఉంటుందనే టాక్‌ ఉంది. అయితే మెహర్‌ రమేష్‌ మాత్రం ఆ విషయాన్ని బయట పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ‘పైసా వసూల్‌’ చిత్రం పోర్చ్‌గల్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. అక్కడే మెహర్‌ రమేష్‌ ఉన్నాడు. సినిమా స్క్రిప్ట్‌ దగ్గర నుండి షూటింగ్‌ సమయంలో సీన్స్‌కు చెప్పడం వరకు అన్ని విషయాల్లో కూడా మెహర్‌ రమేష్‌ వేలు పెడుతున్నాడు. బాలయ్య స్టైలిష్‌గా కనిపించడం వెనుక కూడా మెహర్‌ రమేష్‌ ఉన్నాడనే టాక్‌ వినిపిస్తుంది. మరి బాలయ్యకు మెహర్‌ రమేష్‌ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.

Leave a Reply