తమన్నా విషయంలో అతి చేస్తున్నారు..!

0
772
tamanna character very small in bahubali 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

tamanna character very small in bahubali 2 movie
మిల్కీ బ్యూటీ తమన్నాపై గత వారం పది రోజులుగా సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో ఎక్కడ లేని జాలీ మరియు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. పాపం తమన్నాకు ఎంత కష్టం వచ్చింది, పాపం తమన్నాకు నమ్మక ద్రోహం జరిగింది, తమన్నాను మోసం చేశారు అంటూ ఎక్కడలేని కథనాలు పుట్టుకు వస్తున్నాయి. ఇవన్ని ‘బాహుబలి 2’లో తమన్నా పాత్ర తగ్గడం గురించి చేస్తున్న కామెంట్స్‌. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌లో తమన్నా కీ రోల్‌ పోషించింది. ఆ సమయంలోనే తమన్నా సెకండ్‌ పార్ట్‌లో పెద్దగా కనిపించబోదని చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్‌లో తమన్నా లీడ్‌గా కనిపిస్తే, సెకండ్‌ పార్ట్‌లో అనుష్క లీడ్‌ రోల్‌లో కనిపిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతూ వస్తున్నారు.

‘బాహుబలి’ స్క్రిప్ట్‌ చర్చల సమయంలో కూడా తమన్నాకు ఆ విషయమే చెప్పడం, ఆమె ఓకే చెప్పడం జరిగింది. రెండవ పార్ట్‌ విడుదలైన తర్వాత తమన్నా తన పాత్ర కాస్త ఉంటే బాగుండు అని అనుకుని ఉంటుంది. కాని తమన్నాకు ముందే తెలుసు, రెండవ పార్ట్‌లో తాను కనిపించబోను అని, అందుకే ఆమె పెద్దగా నొచ్చుకున్నది లేదు. కాని నెటిజన్స్‌ మాత్రం తమన్నా మనస్సు చివుక్కు మందని, రాజమౌళి దారుణంగా మిల్కీ బ్యూటీని చీట్‌ చేశాడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెడుతున్నారు. తమన్నా పాత్రకు సెకండ్‌ పాత్రలో ఛాన్స్‌ లేదు. కథ మొయిన్‌గా దేవసేన చుట్టు తిరుగుతుంది. దాంతో తమన్నాకు ఛాన్స్‌ దక్కలేదు. దాంట్లో పెద్దగా బాధ పడాల్సిన పనేం లేదు.

Leave a Reply