కొత్త కుర్రాడితో మిల్కీ ఐటం.. ఇంత చీపా..!

tamanna item song new entry hero

హీరోయిన్స్ ఎలాంటి అవకాశాన్ని వదులుకోవాలని చూడరు.. ఇక వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా అయితే ఇంకాను.. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ఐటం సాంగులతో హీటెక్కిస్తున్న ఈ భామ ఇప్పుడు మరో కొత్త హీరో ఐటం సాంగ్ కోసం సైన్ చేసిందట. అది కూడా కేవలం 25 లక్షల రెమ్యునరేషన్ తోనే.. కర్ణాటక మాజి సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా కన్నడ తెలుగు భాషల్లో జాగ్వార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేశారు.

అసలైతే ముందు శృతి హాసన్ కోసం ప్రయత్నించగా సాంగ్ చేస్తా కాని కోటి ఇస్తేనే అన్నదట. ఇక ఆ క్రమంలోనే ఐటం స్పెషల్ బ్యూటీ మిల్కీ భామను అడుగగా పాతికకే ఓకే చెప్పేసిందట. మరి హీరోయిన్ గా మంచి సినిమాలు చేస్తున్నా వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోనియ్యాలి అని తమన్నా ఈ సాంగ్ చేసేస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ తో చేసిన రెండు సినిమాల్లో రెండు ఐటం సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు నిఖిల్ తో కూడా ఆడి పాడనుంది. తమన్నా సొగసులు ఈ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడతాయో సినిమా వస్తేనే గాని చెప్పలేం.

SHARE