తమన్నా షాక్ ఇస్తుందట..!

0
543
tamanna-bhatia-pinky-south-indian-actress-hd-wallpaper_1456651958

 

Posted [relativedate]

బాహుబలితో కాస్త కూస్తో క్రేజ్ దక్కించుకున్న తమన్నా ఆ సినిమాలో అవంతిక పాత్రలో అదరహో అనిపించింది. ఇక ఆ తర్వాత బెంగాల్ టైగర్, ఊపిరి, ధర్మదురై, అభినేత్రి ఇలా వరుసెంట సినిమాలైతే చేస్తుంది అవి ఎంతవరకు ప్రేక్షకాదరణ పొందినవి అంటే చెప్పడం కష్టమే. అయితే అట్టర్లీ పొయినవి కూడా లేవనుకోండి.. బాహుబలి-2 తర్వాత తమన్నా పరిస్థితి ఏంటి అమ్మడు ఏయే సినిమాల్లో నటిస్తుంది అన్నది ఇంకా బయట పడలేదు.

ఒకవేళ ఆమెకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదా.. తమన్నా కూడా పెట్టా బేడా సర్ధేయాల్సిన పరిస్థితి వచ్చిందా అంటూ మీడియా రాగాలు తీసే లోపే తమన్నా తన వంతుగా తను చేయబోయే సినిమాల లిస్ట్ తెలిస్తే అందరు షాక్ అవుతారంటుంది. స్టార్స్ తో త్వరలో వరుసగా ఎనౌన్స్ మెంట్ లు వచ్చే అవకాశాలున్నాయట. అందుకే తమన్నా తొందరేం లేదు అని అంటుంది. ఇక ఇప్పటికిప్పుడు తమన్నాను కోరుకునే హీరోలెవరు అంటే మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా తమన్నా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

ఆ ఇద్దరే కాదు మహేష్ బాబు కూడా ఆగడుతో మొదట జతకట్టినా అది ఫ్లాప్ అవడంతో మరోసారి తమన్నాను హీరోయిన్ గా ప్రయత్నిద్దామని ఆలోచిస్తున్నాడట. సో ఈ ప్రాజెక్టులు ఎలాగు తనకు కన్ఫాం అయ్యే అవకాశాలుండటంతో తమన్నా అంత డేర్ గా ఉందని అంటున్నారు. మరి వీటిలో ఏవి తమన్నా హీరోయిన్ గా చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply