అయ్యో పాపం.. అవంతికకు అన్యాయం చేశారు

0
1121
tamanna scenes deleted in bahubali 2 movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

tamanna scenes deleted in bahubali 2 movie
బాహుబలి మొదటి పార్ట్‌లో పచ్చ బొట్టేసిన పాట ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటలో తన అందాలతో ఆకట్టుకుని, కొన్ని ముఖ్యమైన సీన్స్‌లలో కూడా తమన్నా అవంతికగా అలరించిన విషయం తెల్సిందే. మొదటి నుండే తమన్నా పాత్ర మొదటి పార్ట్‌ వరకే అని, రెండవ పార్ట్‌లో తమన్నా పెద్దగా కనిపించదంటూ చెబుతూ ప్రేక్షకులను ఆ దిశగా రెడీ చేశారు. అయితే రెండవ పార్ట్‌ చిత్రీకరణ సమయంలో తమన్నాతో పలు సీన్స్‌ను చిత్రీకరించారు. యుద్ద సన్నివేశాల్లో కూడా తమన్నా నటించింది. కాని చివరకు ఆ షాట్స్‌ లేకుండా చేశారు.

తమన్నా రెండవ పార్ట్‌లో కొన్ని నిమిషాలు అయినా కనిపిస్తుందని భావించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పాలి. రెండవ పార్ట్‌లో ఆమె సీన్స్‌ ఉంచాలని మొదట భావించినప్పటికి లెంగ్త్‌ ఎక్కువ అయిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తమన్నా సీన్స్‌ అన్ని తొలగించాల్సి వచ్చిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అందుకే సినిమా ప్రమోషన్‌ సమయంలో తమన్నాకు స్కోప్‌ ఇవ్వలేదు. పాత్ర లేని తమన్నాను ప్రమోషన్‌లో వాడటం కరెక్ట్‌ కాదని రాజమౌళి అవంతికను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా రెండవ పార్ట్‌లో చిన్న రోల్‌ ఉన్నా కూడా మరింత గుర్తింపును తెచ్చుకునేది.

Leave a Reply