Posted [relativedate]
టాలీవుడ్, కోలీవుడ్ ని ఏకకాలంలో ఏలిన మిల్కీబ్యూటీ తమన్నా కన్ను ఇంకా బాలీవుడ్ మీదే ఉంది. హిమ్మత్ వాలా, తూతక్ తూతక్ తూతియా వంటి హిందీ సినిమాల్లో నటించింది తమన్నా. ఈ రెండు సినిమాలు యావరేజ్ అవ్వడంతో మరోసారి తన లక్ ని పరీక్షించుకోబోతోంది తమ్మూ.
స్టార్ హీరో జాన్ అబ్రహం సినిమా చోర్ నికల్ కే భాగ లో నటించడానికి తమన్నా ఓకే చేప్పింది. అయితే తమ్మూ ఈ సినిమాలో హీరోయిన్ కాదట. కథలోని ఓ కీ రోల్ లో నటించనుందట. ఈ పాత్రలో తమన్నా ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తుండగా జేఏ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. మరి ఈ థ్రిల్లర్ తోనైనా మిల్కీ బ్యూటీ బాలీవుడ్ అభిమానులను మెప్పిస్తుందేమే చూడాలి.