పెళ్లి కూతురు డ్రస్ ఇలాగా?

 Posted March 25, 2017

Tamil Bride Wearing Saree With Slit In Canadian Magazine Sparks Debate
అది కెనడా నుంచి వెలువడే ఓ పెళ్లి సంబంధాల మ్యాగజైన్.పేరు జోడి.ఇండియన్ పేరు పెట్టుకున్నా ఆ సంస్కృతి ఏ మాత్రం ఒంటబట్టించుకున్నట్టు లేదు.ఇష్టారాజ్యంగా ఆ పత్రిక కవర్ పేజీ మీద వేసిన ఓ ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపితే,తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తోంది.ఇంతకీ అంత వివాదం ఎందుకు రేగిందో చూద్దాం..

జోడి కవర్ పేజీ ఫొటోలో ఓ తమిళ అమ్మాయి సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో పెళ్లి కూతురిలా ముస్తాబు అయినట్టు చూపించారు.కానీ అమ్మాయి కట్టుకున్న చీర ఆమె కాలిని కవర్ చేయకుండా నగ్నంగా కనిపించేలా వుంది.ఈ ఫొటోలో మోడల్ గా తనుష్క సుబ్రమణియం నటించగా టాగ్ లైన్ కూడా చిత్రంగా పెట్టారు..”విశాల దృష్టితో ఆలోచించు ..మార్పును ఆహ్వానించు “అన్న ఉప శీర్షిక కూడా వివాదానికి ఇంకో కారణం.

ఈ ఫోటో మీద సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అవుతోంది.ఈ ఫోటోని పబ్లిష్ చేయడం ద్వారా కెనడా పత్రిక తమిళ సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిందని కొందరు అంటుంటే …ఇది మారుతున్న కాలానికి అద్దం పడుతోందని ఇంకొందరు వాదిస్తున్నారు.ఏమైనా పాశ్చాత్య సంస్కృతిలో సైతం పెళ్లి సందర్భంగా ఇలాంటి వస్త్ర ధారణ ఎక్కడైనా చేస్తారా అని సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు.విశాల భావాలకి,విశృంఖలత్వానికి మధ్య తేడా తెలుసుకుని ప్రవర్తించాలని హితవు చెబుతున్నారు.అయితే ఇంత వివాదానికి కారణమైన జోడి పత్రిక మాత్రం ఈ పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తోంది.ఈ ఫోటోని సరిగ్గా చూస్తే కళాత్మక కోణం తో పాటు ఫెమినిజం కూడా కనిపిస్తుందని ఆ పత్రిక మేనేజ్ మెంట్ అంటోంది.

SHARE