జయ మరణాన్ని ముందే అంచనా వేసిన క్యాలెండర్…

0
493
Tamil calendar predicts Amma’s death

Posted [relativedate]

Tamil calendar predicts Amma’s death
పురుచ్చితలైవి జయలలిత ఇంత హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఓ క్యాలెండర్ మాత్రం జయ మరణాన్ని ముందే అంచనా వేసింది. అదే అక్షరాలా నిజమైంది. అంతేకాదు అమ్మ భౌతికకాయం ఉండగానే.. పక్కనే ఆమె వారసుల గురించి చర్చ జరుగుతుందని కూడా చెప్పింది. చివరకు అదే జరిగింది. ఇంత కచ్చితంగా ఎలా అంచనా వేసిందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చెన్నెలోని ఓ దుకాణం 2016 క్యాలెండర్ ను ప్రింట్ చేసింది. ఈక్యాలెండర్ లో ఒక్కో తేదీపై తాత్వికతతో ముడిపడి ఉన్న వాక్యాలను రాశారు. డిసెంబర్ 5న ఆ క్యాలెండర్ లో ఓ గ‌దిలో మ‌ర‌ణం.. ఆ ప‌క్క గ‌దిలోనే వార‌స‌త్వ గొడవ’ అనే వాక్యాన్ని ప్రింట్ చేశారు. తాత్విక ఆలోచనల్లో భాగంగానే అది రాసినా అది అక్షరాలా నిజం కావడం కాకతాళీయమే అయినా అంత కచ్చితంగా ఎలా జరిగిందన్న చర్చ జరుగుతోంది.

క్యాలెండర్ లో రాసినట్టుగానే జయలలిత విషయంలో జరిగింది. అపోలో ఆస్పత్రిలోని ఓ రూంలో జయ భౌతిక కాయం ఉంది. అదే బిల్డింగ్ లో ఆమె వారసుల గురించి మంతనాలు జరిగాయి. అది కూడా చాలా సీరియస్ గా. ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు ఈ సంప్రదింపులు జరిగాయి. అంటే గదిలో మరణం… ఆ పక్క గదిలోనే వారసత్వ గొడవ అనే మాటలు నిజంగానే జరిగాయి. ఇంత కచ్చితమైన మాటలు రాసిన ఆ క్యాలెండర్ ఎక్కడ దొరుకుతుందా అని అందరూ ఆరా తీస్తున్నారు.

Leave a Reply