తప్పతాగి పోలీస్ జీపునే ఢీ కొట్టిన హీరో..!

0
632

tamil hero arun vijay arrested

వీకెండ్ వచ్చిందంటే సెలబ్రిటీలు పబ్, డిస్కోలంటూ ఎంజాయ్ చేయడం మాములే ప్రమాదాలు ఎక్కువగా తాగిన మత్తులోనే జరుగుతుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్రోలింగ్ కూడా ఎక్కువైంది. ఇక ఇదే టైంలో ఓ తమిళ నటుడు ఫుల్ గా తాగేసి ఏకంగా పోలీస్ జీపునే ఢీ కొట్టాడట. పెద్ద సౌండ్ రావడంతో ఏం జరిగిందా అని చూసే అక్కడ తమిళ నటుడు అరుణ్ విజయ్ ఫుల్ డ్రింక్ లో ఉన్నాడట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అతన్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సంఘటనలో కార్లో అతనితో తన భార్య కూడా ఉండటం విశేషం. అయితే చెన్నైలో హాట్ టాపిక్ అయిన్ ఈ న్యూస్ గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటున్నారు. అరుణ్ విజయ్ చెన్నైలో హీరోగా చేస్తున్నా మెగా పవర్ స్టార్ రాం చరణ్ బ్రూస్ లీలో విలన్ సంపత్ కొడుకు క్యారక్టర్ లో నటించాడు. అయితే సెలబ్రిటీస్ ఇలా బుక్ అవ్వడం వారికి కొత్తేమి కాదు లేండి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న అజయ్ విజయ్ బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట.

Leave a Reply