ఫస్ట్ హాఫ్ కి రివర్స్ లో సెకండ్ హాఫ్..

0
278
tamil nadu assembly trust vote meetings doing like movie

Posted [relativedate]

tamil nadu assembly trust vote meetings doing like movie
పళనిస్వామి బలపరీక్ష ఎపిసోడ్ సినిమాని తలపించింది.ఫస్ట్ హాఫ్ లో విపక్షాలు రెచ్చిపోయాయి. స్పీకర్ ధన్ పాల్ కి చుక్కలు చూపించాయి .స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు ఓటింగ్ వాయిదా వేయించేందుకు చేయని ప్రయత్నాలు లేవు.అసెంబ్లీ ని కుస్తీ గోదా గా మార్చేశారు. స్పీకర్ ని చుట్టుముట్టి ఆయన సీట్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి కల్పించి ఆ స్థానంలో కుర్చునేదాకా వెళ్లారు డీఎంకే ఎమ్మెల్యేలు.మైకులు విరగ్గొట్టారు.కుర్చీలు విసిరేశారు.అది ఇది అని కాకుండా చేయాల్సిందంతా చేస్తూ రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టారు.అసెంబ్లీ ని రణరంగంగా మార్చేశారు. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో సీన్లు.

రెండో హాఫ్ సరిగ్గా రివర్స్ అయ్యింది.స్పీకర్ షర్ట్ చింపి అవమానించిన డీఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసాక సీన్ మారిపోయింది.మార్షల్స్ డీఎంకే ఎమ్మెల్యేల్ని,పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలకు సినిమా చూపించారు.స్టాలిన్ చొక్కా చించేసి సభ నుంచి బయటకు తీసుకొచ్చి పడేశారు. పన్నీర్ సెల్వం తో పాటు ఆయన వర్గీయులకు దాదాపు ఇదే అనుభవం ఎదురైంది.సభ నుంచి బయటికి వచ్చాక పన్నీర్ దాని గురించే మాట్లాడారు.మూడున్నాళ్ల ముచ్చట కోసం మమ్మల్ని కొట్టి నెట్టేస్తారా అని వాపోయారు.అవతల పళనిస్వామిని నడిపిస్తోంది చిన్నమ్మ అన్న విషయం మర్చిపోతే ఎలా పన్నీర్? సెకండ్ హాఫ్ ఇప్పుడే మొదలైంది.ఇక క్లైమాక్స్ ఏ స్థాయిలో ఉంటుందో ..ఏమిటో ?

Leave a Reply