పూజలతో హోరెత్తుతున్న తమిళనాడు..

 Posted October 27, 2016

tamil nadu people devotion on temple for jayalalitha karunanidhi healthతమిళనాడు వాతావరణం చూస్తే కొబ్బరికాయల కరువు వచ్చేట్టు వుంది.తమిళనాడంతా పూజలు,పునస్కారాలతో కన్పిస్తోంది.ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని నిన్నమొన్నటిదాకా అన్నాడీఎంకే కార్యకర్తలు వివిధ దేవస్థానాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహించారు.హోమాలు,యజ్ఞాలు సంగతి సరే సరి.ఇక ఇప్పుడు ఆమె కోలుకున్నారని తెలియగానే దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకోవడం మొదలైంది.ఆమె డిశ్చార్జ్ కూడా కాకముందే ప్రతిపక్షనేత కరుణానిధి కూడా అస్వస్థతకి గురయ్యారు.సహజంగా నాస్తిక వాదానికి మద్దతుగా వుండే డీఎంకే శ్రేణులు కూడా ఈసారి దేవాలయాల్లో కరుణ ఆరోగ్యం కోసం పూజలు చేయిస్తున్నారు. ఇక తమిళులు భారీగా జరుపుకునే దీపావళి కూడా దగ్గరికి రావడంతో ఆ రాష్ట్రం లో ఎక్కడ చూసినా భక్తి,పూజలు,మొక్కులు గురించే వినిపిస్తోంది.. కనిపిస్తోంది.ఇదేనేమో అవసరానికి దేవుడు కనపడ్డమంటే..

SHARE