Posted [relativedate]
తమిళనాడులో అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకే బలమైన పార్టీలు. ఏళ్ల నుంచి ఏదో ఒక పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. జయలలిత మరణం తర్వాత రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. అటు కరుణానిధి అనారోగ్యంతో ఉన్నారు. వయస్సు మీద పడ్డ ఆయనకు… పార్టీని నడపడం కష్టంగా మారింది. ఆయన వారసులు కుమ్ములాటలే తప్ప పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే తమిళనాట ప్రాంతీయపార్టీలకు కాలం చెల్లినట్టేనన్న విమర్శలున్నాయి.
ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ లో ప్రాంతీయపార్టీలను నడిపే సమర్థ నాయకులు కరువయ్యారు. దీంతో జాతీయ పార్టీలకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ప్రధాని మోడీకి ఇది కచ్చితంగా అడ్వాంటేజేనని చెప్పొచ్చు. ఇదే అవకాశంగా బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మోడీపై దీనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందులో భాగంగా పన్నీరు సెల్వంను దారి తెచ్చుకున్నారట బీజేపీ నేతలు. కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు కాబట్టి పన్నీరు సెల్వం కు ఎలాగూ.. అక్కడ్నుంచి సహాయం అవసరం. ఎందుకంటే ఎమ్మెల్యేలను నయానో భయానో తన దగ్గర ఉంచుకోవాల్సిందే. వారి జారిపోకుండా చూడాలంటే ఆ మాత్రం చేయక తప్పదు. సో ఆయన కూడా బీజేపీ కండిషన్స్ కు ఓకే చెప్పారట.
పన్నీరు సెల్వం ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నడుపుతున్నా… త్వరలోనే అందరినీ బీజేపీ దిశగా ట్యూన్ చేసే అవకాశముంది. జాతీయ పార్టీ అవసరం కాబట్టి డీఎంకేను ఢీకొట్టేందుకు బీజేపీతో క్లోజ్ కావాలని ప్లాన్ చేస్తున్నారట. ఫ్యూచర్ లో ఏకంగా అన్నాడీఎంకేను బీజేపీలో విలీనం చేసినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు.