తెలుగోడి చేతిలో తమిళ్ రాజకీయం

0
327
tamil politics in telugu leaders

Posted [relativedate]

tamil politics in telugu leadersదేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తున్న ఉపఎన్నిక ఆర్కేనగర్. గతంలో ఇక్కడ దివంగత సీఎం జయలలిత ఘనవిజయం సాధించారు. ఆమె ఆకస్మిక మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ ఎన్నికలతో పాటు ఇక్కడ జయ వారసత్వం కూడా పోటీ జరుగుతోంది. అన్నాడీఎంకే గుర్తుని ఈసీ స్తంభింపజేయడంతో.. ప్రజా బ్యాలెట్ లో తామే అసలైన లీడర్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా అటు పన్నీర్, ఇటు శశి వర్గాలకు ఉంది. అందుకే గెలుపు కోసం ఏ ఛాన్స్ ను వదలడం లేదు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ఆర్కేనగర్లో.. తెలుగు స్టార్స్ ను బరిలోకి దించి తమిళ్ మార్క్ రాజకీయం చేస్తున్నారు.

చెన్నై నడిబొడ్డున ఉండే ఆర్కేనగర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లదే నిర్ణాయక పాత్ర. ఇక్కడ మొత్తం అరవై వేల మంది తెలుగువాళ్లున్నారు. వీళ్లంతా అమ్మ జయలలితకు వీరాభిమానులు. ఆమె అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాగా అభిమానించేవారు. అందుకే ఆమె చాలా ఈజీగా ఇక్కడ గెలిచేవారు. మొన్నటి ఎన్నికల్లో అయితే అనారోగ్యం కారణంగా సరిగా ప్రచారం కూడా చేయలేదు. అయినా సరే ఇక్కడ జయలలితకు భారీ మెజార్టీ వచ్చింది. అలాంటి తెలుగువాళ్ల మద్దతు కోసం పన్నీర్, శశికళ వర్గాలు సినీతారల్నే నమ్ముకున్నాయి.

పన్నీర్ వర్గ అభ్యర్థి మధుసూదనన్ స్వయంగా తెలుగువాడు. మరో తెలుగువాడైన సినీ నటుడు స్నేగన్ మద్దతు తీసుకుంటున్నాడు. దీంతో అప్రమత్తమైన శశికళ టీమ్.. విజయశాంతి, శరత్ కుమార్ లాంటి తెలుగునటుల మద్దతు సంపాదించింది. విజయశాంతి ఇప్పటికే ఆర్కేనగర్లో చాలా అగ్రెస్సివ్ గా ప్రచారం చేస్తున్నారు. శరత్ కుమార్ తో కూడా ఇలాంటి క్యాంపైన్ చేయించాలనేది శశికళ వర్గ అభ్యర్ధి దినకరన్ ఆలోచన. కానీ ఈలోగా ఐటీ రెయిడ్స్ జరగడంతో.. మొత్తం సీన్ రివర్సైంది. వంద కోట్లు ఓటర్లకు పంచినట్లు తేలడంతో.. అసలు ఉపఎన్నిక జరగడమే అనుమానంగా మారింది. కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తెలుగువాళ్లను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని తమిళ పార్టీలు ఫిక్సయ్యాయి.

Leave a Reply