తమిళ సినీ ,టీవీ నటి సబర్న మృతి …

Posted November 12, 2016

tamil serial actress sabarna anand commits suicide
ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ (29) శుక్రవారం మరణించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నప్పటికీ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందనే కధనాలు వస్తున్నాయి .విలక్షణ పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సబర్న ఆకస్మిక మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

తమిళనాడు రాజధాని చెన్నై లోని సీమతమాన్ నగర్ లో నివాసంలో మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసి వుండడం, దుర్వాసన వస్తుండడడంలో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. అన్నాసాగర్ డిప్యూటీ పోలిస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తలపై తీవ్రమైన గాయం, మృతదేహం కుళ్లిపోయివుండడంపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె మూడు రోజుల క్రితమే చనిపోయి వుంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ ను కూడా దొరికినట్టు సమాచారం .

ఉడుముల పేట పట్టణానికి చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె చెన్నై లో ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు.

SHARE