రజినీకి అంత సీన్ లేదా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమాల్లో ఆయన స్టైలింగ్‌కి అభిమానులు ఫిదా అయిపోతారు. ఆయన స్టైలే వేరు. డ్రెస్సింగ్‌ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్నీ ప్రత్యేకమే. ఆయన్ని అనుకరించడం అంత వీజీ కాదు. దటీజ్‌ రజనీకాంత్‌. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి, బాలీవుడ్‌లోనూ చాలా పాపులారిటీ వుంది. షారుక్‌ఖాన్‌ అంతటి బాలీవుడ్‌ సూపర్‌ స్టారే, తన సినిమా చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం తలైవా రజనీకాంత్‌ భజన చేయాల్సి వచ్చింది. సినిమా వేరు, రాజకీయం వేరు కదా.! ఆ విషయం రజనీకాంత్‌కీ బాగా తెలుసు.  

కానీ, రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి అభిమానుల వైపు నుంచి గట్టిగా వస్తోంది. ఇంకో వైపున, తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఊరించేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న భావన రజనీకాంత్‌లో కూడా వుంది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే మంచిదే.. అంటూ సినీ జనం ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. అదే సమయంలో, ఆయన పట్ల రాజకీయ వ్యతిరేకత కూడా సినీ ప్రముఖుల నుంచి వ్యక్తమవుతుండడం గమనార్హం.

రజనీకాంత్‌ తమిళ సూపర్‌ స్టార్‌ అయినా, ఆయన మూలాలు తమిళనాడులో లేవు.. ఆయన కర్నాటకలో జన్మించారు. అక్కడే, ఆయన బస్‌ కండక్టర్‌గా కూడా పనిచేశారు. అది, రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరమైన అంశమే. ప్రాంతీయ రాజకీయాలు నిస్సిగ్గుగా రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్‌కి ఇదే తొలి ప్రతిబంధకం కానుందన్నది నిర్వివాదాంశం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మూడు రోజులు వరుసగా అభిమానులతో భేటీలు నిర్వహిస్తున్న రజనీకాంత్‌, ఇప్పటికే రాజకీయాలపై కన్‌ఫ్యూజన్‌తో కూడిన కొంత క్లారిటీ ఇచ్చేశారు.

Leave a Reply