డిసెంబర్ అంటేనే వణికిపోతున్న తంబీలు!!

Posted December 14, 2016

tamilians fear about december
తమిళనాడును డిసెంబర్ సెంటిమెంట్ వెంటాడుతోంది. డిసెంబర్ వచ్చిందంటే చాలు ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. ఎందుకంటే తమిళనాడుకు డిసెంబర్ మాసం ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి కీడు డిసెంబర్ లోనే వచ్చింది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే అది నిజమేనని స్పష్టమవుతోంది.
ఎంజీఆర్ ప్రోత్సాహంతో పాలిటిక్స్ లోకి వచ్చిన పురుచ్చితలైవి జయలలిత ఈనెల 5న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అంతకుముందు ఎంజీఆర్ డిసెంబర్ 24, 1987 లో కన్నుమూశారు. ఇక స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించిన తమిళనాడు మహానేత సి. రాజగోపాలచారి డిసెంబర్ 25, 1972లో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. హేతువాద నాయకుడు పెరియార్ ఇ.వి రామస్వామి డిసెంబర్ 24, 1972న మృతి చెందారు. ప్రముఖులే కాదు ప్రకృతి కూడా డిసెంబర్ లోనే తమిళనాడును ఇబ్బందిపెట్టింది.
డిసెంబర్ 26, 2004న వచ్చిన సునామీ వేలాదిమంది తమిళులను పొట్టనబెట్టుకుంది. ఇక గతేడాది చెన్నైను ఆగం చేసిన భారీ వర్షాలు వచ్చింది డిసెంబర్ లోనే. డిసెంబర్, 2015లో వచ్చిన భారీ వర్షాలకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఏ విపత్తు అయినా డిసెంబర్ లోనే రావడంతో తమిళులు… డిసెంబర్ అంటేనే హడలిపోతున్నారు.

SHARE