జయ మహాభినిష్క్రమణం..

Posted December 6, 2016

Tamila nadu C.M jayalalitha Passed awayమృత్యువుతో దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ పోరాటం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారు.జీవితమంతా పోరాటాలు చేసి గెలిచిన ఆ మహా నాయకురాలు మృత్యువు ముందు మాత్రం ఓడిపోయారు.ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె అసామాన్య నాయకురాలిగా ఎదిగారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ..ఎన్ని ఆటంకాలు వచ్చినా వెన్ను తిప్పని ధీరోదాత్తురాలుగానే ఆమె వున్నారు.సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసి తమిళనాడులోని పేదలందరికీ అమ్మ అయ్యారు.ఆ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగాను ఆమెకి ఎందరో అభిమానులు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ లకి సైతం ఆమె తనదైన శైలిలో ఝలక్ ఇచ్చిన సందర్భాలెన్నో.

సెప్టెంబర్ 22 న తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య జయని చెన్నై అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఆమె కి అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు చికిత్స చేశారు. ఓ 45 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నట్టు కనిపించారు.అపోలో వైద్యులు కూడా ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డిశ్చార్జ్ కావొచ్చని ప్రకటన చేశారు.అయితే అంతలోనే అనూహ్యంగా ఆమె నిన్న సాయంత్రం 6 .30 గంటల సమయంలో తీవ్ర గుండె పోటుకి లోనయ్యారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డాక్టర్లు ఆమె ప్రాణాలు నిలపలేకపోయారు.ఆమె మహాభినిష్క్రమణాన్ని కొద్దిసేపటి కిందట అధికారికంగా ధృవీకరించారు.

 

SHARE