జయ ఆరోగ్యంపై కోర్టుకెక్కిన న్యాయవాది..

Posted October 3, 2016

tamilnadu chief minister jayalalitha health conditionతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఇంకా స్పష్టత రాలేదు.ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని,ఆమెకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారని వార్తలొస్తున్నాయి వాటిని ఎవరూ నమ్మలేని పరిస్థితి.దీంతో కొనసాగుతునున్న అనిశ్చితికి తెరదించాలని ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించాడు.రామస్వామి అనే లాయర్ జయ ఆరోగ్యంపై వాస్తవపరిస్థితిని చెప్పాలని హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.రేపు అంటే మంగళవారం ఈ కేసు విచారణకి రానుంది.

మరో వైపు 11 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ ఆరోగ్యం పై తమిళనాడు అంతటా ఆందోళన తారాస్థాయికి చేరుకుంటోంది.అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె కోలుకోవాలని నిత్య ప్రార్ధనలు,పూజలు జరిపిస్తున్నారు.జయ ఉన్న ఆస్పత్రికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో వారిని నిలువరించడం పోలీసులకి తలకి మించిన భారం అవుతోంది.

SHARE