దిక్కులేని వాడికి దేవుడే దిక్కు

0
453
Tamilnadu cm palanisamy visited tirupathi

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Tamilnadu cm palanisamy visited tirupathiఒక్కొక్కటిగా వచ్చిపడుతున్న సమస్యలు కారణం కావచ్చు పొరుగు రాష్ట్రంలో ఉన్న కలియుగ దైవాన్ని సీఎం పీఠం అధిరోహించినప్పటి నుంచి సందర్శించుకోకపోవడం అయి ఉండవచ్చు…కారణం ఏదైనా కానీ తమిళనాడు సీఎం పళనిస్వామి తిరుమల పర్యటన ఆసక్తిగా మారింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పళనిస్వామి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ప్రస్తుతం తమిళనాడులో ఒకింత ఉత్కంఠమైన పరిస్థితులే నెలకొన్న సంగతి తెలిసిందే.

పెద్దనోట్లు రద్దు తరువాత ఐటీ శాఖ అధికారులు చెన్నైలోని టీనగర్ లో టీటీడీ సభ్యుడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో శేఖర్ రెడ్డి గదిలో అధికారులు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డైరీ ఆధారంగా ఐటీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన తీరు చర్చనీయాంశంగా మారింది. శేఖర్ రెడ్డి వ్యవహారం మంత్రులు ఎమ్మెల్యేలు కొందరు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

దీంతో పళనిస్వామి ప్రభుత్వం మనుగడపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటన పెట్టుకొని క్షేత్రస్థాయిలో తిరుగుతూ అన్నాడీఎంకే శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయని తన మద్దతుదారులతో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి సమస్యల నుంచి బయటపడటానికే ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటున్నారని చర్చ నడుస్తోంది.

Leave a Reply