తమిళనాడు సీఎస్ డబ్బు ఏపీ కెలా వచ్చింది?

0
470
tamilnadu money in ap

Posted [relativedate]

tamilnadu money in apతీగ లాగితే డొంక కదలడం అంటే ఇదేనేమో …తమిళనాట పేరు మోసిన ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇంట దొరికిన వంద కోట్లకి పైగా నోట్ల కట్టలు ఎన్నో లోగుట్టుల్ని …లోపాయికారీ సంబంధాల్ని బయట పెడుతున్నాయి. ఆ డబ్బు శశికళ ది కావొచ్చని మొదట్లో వినిపించింది.దర్యాప్తు బృందాలు శేఖర్ రెడ్డి ని విచారించాక ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు సీఎస్ రామమోహన్ రావు ఇళ్లు,ఆస్తుల మీద ఐటీ దాడులు మొదలయ్యాయి.దీనికి తమిళ్ సీఎం పన్నీర్ సెల్వం అనుమతి ఉందని తెలుస్తోంది.అక్కడ జరుగుతున్న వారసత్వ పోరులో రామ్మోహన్ వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.రామ్మోహన్ రావు తెలుగు వాడు కావడంతో అక్రమార్జన ఏపీ కి ఏమైనా తరలిందా అన్న కోణం నుంచి దర్యాప్తు చేస్తే ఆ అనుమానం నిజమేనని తేలింది.

రామమోహన్ రావు పెద్ద ఎత్తున వున్న సొమ్ముని బంగారంగా మార్చి చిత్తూర్ తరలించినట్టు సమాచారం.ప్రకాశం జిల్లాకి చెందిన రామ్మోహన్ రావు చిత్తూరు జిల్లాని ఎంచుకోడానికి అక్కడ వున్న బంధుత్వమే కారణమని తెలుస్తోంది.డీకే ఆదికేశవులు తమ్ముడు బద్రి నారాయణ కుమార్తెను …రామ్మోహన్ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు.ఆ బంధుత్వం తోటే వాళ్ళు అక్కడ డబ్బు దాచినట్టు తెలిసి ఐటీ బృందాలు బద్రి నారాయణ ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ విధంగా తమిళ్ సీఎస్ డబ్బు ఏపీ కి చేరిందన్నమాట .

Leave a Reply