ఇద్ద‌రు లెజెండ్స్ లేకుంటే త‌మిళ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్?

Posted December 5, 2016

jayalalithaa-karunanidhi
త‌మిళ‌నాడు రాజ‌కీయ‌మే వేరు. అక్క‌డ వ్య‌క్తి ఆరాధ‌న ఎక్కువ‌. అటు జ‌య‌ల‌లిత కానీ,, ఇటు క‌రుణానిధి కానీ ఇలాగే పైకొచ్చారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ తో త‌మ త‌మ పార్టీల‌ను నిల‌బెట్టారు. ఐదేళ్లోకోసారి ఆటుపోట్లు కామ‌న్ గా మారినా… త‌ట్టుకొని నిల‌బ‌డ్డారు. అందుకే జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కొంచెం త‌గ్గి మాట్లాడుతుంది. కేంద్రంలో ఉన్న వారెవ‌రూ వారితో క‌య్యాన్ని కోరుకోరు. ఇప్ప‌టిదాకా అలా జ‌ర‌గ‌లేదు కూడా.
ఇప్పటివ‌ర‌కు ఒకే గానీ.. జ‌య‌లలిత‌, క‌రుణనిధి త‌ర్వాత ప‌రిస్థితి ఏంట‌ని ఆలోచిస్తే మాత్రం త‌మిళ‌నాడు పాలిటిక్స్ ను ఎవ‌రూ అంచ‌నా కూడా వేయ‌లేక‌పోతున్నారు. జ‌య‌ల‌లిత‌ను తీసేస్తే అన్నాడీఎంకే జీరో.

అమ్మ త‌ర్వాత ఆ స్థాయిలో ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడు కానీ.. నాయ‌కురాలు కానీ పార్టీలో లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా… వారు వ్య‌క్తిగ‌త బ‌లం కంటే అమ్మ బొమ్మ‌తో గెలిచినా వారే. అటు డీఎంకేది కూడా దాదాపుగా అదే ప‌రిస్థితి. అయితే డీఎంకేకు ఒక అడ్వాంటేజ్ ఉంది. క‌రుణ‌కు వార‌సులున్నారు. అళ‌గిరి, స్టాలిన్, క‌నిమొళి.. వీరంతా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు కూడా. కానీ ఇప్ప‌టిదాకా వ్య‌క్తిగ‌తంగా త‌మ‌కంటూ ఒక ఇమేజ్ ను తెచ్చుకోలేక‌పోయారు. దాంతో ప్ర‌తిదానికి 90 ఏళ్లు మీద ప‌డ్డ క‌రుణ‌పైనే డీఎంకే ఆధార‌ప‌డి ఉంది.

అటు జ‌య కానీ, ఇటు క‌రుణ ఆరోగ్యం ఈ మ‌ధ్య బాగాలేదు. దీంతో ఇద్ద‌రి వార‌సులు ఎవ‌రన్న చ‌ర్చ న‌డుస్తోంది. చ‌ర్చ వ‌ర‌కు ఒకే కానీ అస‌లు వారిద్ద‌రు లెజెండ్స్ లేకుండా త‌మిళ పాలిటిక్స్ ఎలాగుంటాయే అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప ఈ రెండు పార్టీలు జ‌య‌, క‌రుణ లేకుండా ముందుకు సాగ‌లేవు అని బల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు చెన్నై పొలిటిక‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్.

SHARE