ఆ స్టేట్ కి దడ పుట్టించిన 2016…

 Posted October 26, 2016

tamilnadu state troubled 2016 yearతమిళనాడుకు 2016 సంవత్సరం కలిసొచ్చినట్లు లేదు. సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి చెన్నై వరదలతో ఉక్కిరిబిక్కిరైంది. నెల రోజుల నుంచి తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ శుభవార్త వినే లోపే రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత కరుణానిధి అనారోగ్య వార్త తమిళ ప్రజలను కలవరపెడుతోంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం ప్రకటించాయి. అలర్జీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. కరుణానిధిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలకు అనుమతినివ్వడం లేదు. కరుణానిధి త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.

SHARE