ఓటమి యాత్ర చేస్తున్న నాయకురాలు..

0
429
tamilnadu vanathi srinivasan jeep journey

 Posted [relativedate]

tamilnadu vanathi srinivasan jeep journey
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచార యాత్రలు..గెలిచాక విజయ యాత్రలు సర్వసాధారణ అంశం. ఓటమి తర్వాత ఎవరికీ యాత్ర ఆలోచన రాదు.కానీ ఆమెకి ఆలోచన వచ్చింది.వెంటనే అమల్లో పెడుతోంది.ఇంతకీ ఆ నాయకురాలు ఎవరంటారా? తమిళ నాడుకి చెందిన వానతీ శ్రీనివాసన్.ఆమె ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.కోయంబత్తూర్ దక్షిణ నియోజక వర్గంలో ఆమె పోటీ చేసి ఓడిపోయారు.నేటి నుంచి ఆమె అదే నియోజక వర్గంలో ఓపెన్ టాప్ జీప్ లో యాత్ర చేస్తున్నారు.ఎందుకిలా అని అడిగితే ఆమె భలే సమాధానమిచ్చారు.ఈ యాత్ర తనకు ఓటేసిన 33 వేల మందికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు …తనకి ఓటేయకుండా ఇంకా కష్టపడాలని చెప్పిన మిగిలిన వారికీ నమస్కారాలు చెప్పుకోడానికి అన్నారు వానతీ శ్రీనివాసన్.ఏమైనా ఓటమి యాత్రకి శ్రీకారం చుట్టి రాజకీయాల్లో సరి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు ఆమె .

Leave a Reply