తాప్సి అతనితో డేటింగ్ చేస్తుందా..?

 tapsee dating saqib saleem

సొట్ట బుగ్గుల సుందరి తాప్సి జోరు దక్షిణాది చిత్రసీమలో మందగించింది. అయితేనేం.. అమ్మడికి బాలీవుడ్ ఆఫర్లు బాగానే ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం తీరిక లేని షెడ్యూల్ ఉంది ఈ ఢిల్లీ బ్యూటీకి. ఇదిలా ఉంటే.. ఈ సుందరి ఎఫైర్ పై బాలీవుడ్ లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాప్సి సాకిబ్ సలీమ్ తో డేటింగ్ చేస్తోందంటూ వార్తలొస్తున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారని.. ఒకరి కంపెనీని మరొకరు ఇష్టపడుతున్నారని అంటున్నారు. టీ-సిరీస్ కోసం తీసిన ఓ మ్యూజిక్ వీడియోలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ పరిచయమే ఇంతింతై.. డేటింగ్ వరకూ వచ్చేసిందని బాలీవుడ్ టాక్. ప్రస్తుం ‘మక్నా’ సినిమాలో తాప్సి, సలీమ్ లు లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్యా మాంచి సిజ్లింగ్ సీన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here