సానియా మీర్జా బయోపిక్ లో తాప్సీ?

 Posted [relativedate]

tapsee in sania mirza biopic movieఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది తాప్సీ. ఐరెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫేట్ సాహసం సినిమాతో మారిపోయింది. అంతకుముందు ఆమె నటించిన మిస్టర్ పర్ ఫెక్ట్ హిట్టైనా ఆ క్రెడిట్ సీనియర్ హీరోయిన్ కాజల్ కొట్టేసింది. అయితే టాలీవుడ్ లో ఒకటి రెండు హిట్సే పడ్డా బాలీవుడ్ లో మటుకు ఈ భామ ఖాతాలో చాలానే హిట్స్ ఉన్నాయని చెప్పచ్చు. సౌత్ లో గ్లామర్ ఇమేజ్ ఉన్న తాప్సీ నార్త్ లో మాత్రం డిఫరెంట్ రోల్స్ ని ఎంచుకుంటే దూసుకుపోతోంది.

ఇటీవల పింక్ సినిమాతో హిట్ కొట్టిన తాప్సీ తాజాగా నామ్   షబానా సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాప్సీ చాలా కష్టపడిందని, ఆమెకు షూటింగ్ సందర్భంగా పలు గాయాలు కూడా అయ్యాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇకపోతే డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న తాప్సీకి టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అలాగే రాజకీయాల్లో ఇందిరా గాంధీ అంటే  ఇష్టమట. సానియా, ఇందిరా గాంధీ  బయోపిక్ లో నటించాలని ఉందని చెబుతోంది.

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదని అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ సినిమాల్లో కూడా నటించాలని అంటోంది. మరి సానియా, ఇందిరా గాంధీల బయోపిక్ లు తెరకెక్కించే దర్శకుడెవరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here