తారక్ తాజా ప్రయత్నం ..

 tarak rathna evaru movieనందమూరి తారకరత్న పట్టు వదలడం లేదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ నెల 5న ‘కాకతీయుడు’ అనే సినిమాతో పలకరించాడు తారకరత్న. అది రెండేళ్లుగా రిలీజ్‌కు నోచుకోని సినిమా. ఈ చిత్రం వచ్చి రెండు వారాలైనా జనాలకు అంతగా తేలీలేదు. ఇప్పుడు ‘ఎవరు’ అనే హార్రర్ థ్రిల్లర్ తో వస్తున్నాడీ హీరో. రమణసెల్వ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఈ నెల 26న విడుదల చేస్తున్నారట.

తారకరత్న కోసం ‘ఎవరు’ థియేట్రికల్ ట్రైలర్ ను నారా రోహిత్ విడుదల చేశాడు. రోహిత్-తారకరత్న కలిసి ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ జానర్లో రూపొందిన ‘ఎవరు’ కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ చిత్రంలో తారకరత్న సైక్రియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న ఈ నందమూరి హీరోకి ‘ఎవరు’ అయినా హిట్ నిస్తుందేమో చూద్దాం.

SHARE