ఎన్టీఆర్ కోరమీసం చెప్తున్న కధ…

Posted November 16, 2016

Tarak Surprise Look Reveals Fans Shockedజనతా గ్యారేజ్ హిట్ తో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఓ పక్క తన తర్వాత సినిమా కూడా అదే రేంజ్ హిట్ సాధించాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నాడు. అయితే నిన్న మొన్నటిదాకా తెలుగు దర్శకుల కథలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తారక్ ఇప్పుడు తమిళ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే సింగం డైరక్టర్ హరి జూనియర్ కు కథ వినిపించడం నచ్చి ఓకే చెప్పడం కూడా జరిగిందట.

ఇక ఇదే క్రమంలో తమిళంలో ఆర్టిస్టిక్ మూవీస్ తీసే బాల కూడా తారక్ ను కలిశాడని తన దగ్గర ఉన్న ఓ అద్భుతమైన కథను తారక్ తో డిస్కస్ చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని కథ చర్చల్లో ఉన్న జూనియర్ రెగ్యులర్ లుక్ తో కాకుండా మీసపు కట్టుతో కనిపించాడు. రీసెంట్ గా శ్రీనివాస్ యాదవ్ కూతురు రిసెప్షన్ కు అటెండ్ అయిన తారక్ అందరిని ఆశ్చర్య పరిచాడు.

అదిరిపోయే లుక్ తో ఎన్టీఆర్ అక్కడి వారినందరిని షాక్ కు గురి చేశాడంటే నమ్మాలి. మరి బాల సినిమా కోసమే తారక్ ఆ మీసం పెంచాడని కొందరంటుంటే లేదు హరి సినిమా కోసం అని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు దర్శకులతో ఇన్నాళ్లు కథల చర్చలు జరిపిన జూనియర్ కాస్త కొత్తగా తమిళ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నాడు.

SHARE