అనవసర ప్రయత్నం.. తరణ్‌కు అంత సీన్‌ లేదు

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

tarun idi naa love story movie teaser launch by nagarjuna
లవర్‌ బాయ్‌గా తరుణ్‌ అప్పట్లో యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉండే వాడు. ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన తరుణ్‌ తక్కువ సమయంలోనే కనుమరుగయ్యాడు. వరుసగా నాలుగు, అయిదు సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో తరుణ్‌కు అవకాశాలే కనుమరుగయ్యాయి. అయినా కూడా ప్రయత్నించాడు. కాని అవకాశాలు రాలేదు. దాంతో దాదాపు ఏడు సంవత్సరాలుగా సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. అయితే ఇటీవలే మరో ప్రయత్నం అంటూ తరుణ్‌ ఒక సినిమాను చేశాడు. ఆ సినిమాతో తరుణ్‌ కం బ్యాక్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

కన్నడంలో సక్సెస్‌ అయిన ఒక సినిమాను తెలుగులో తరుణ్‌ హీరోగా ‘ఇది నా లవ్‌ స్టోరీ’ తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. నాగార్జున విడుదల చేసిన ఈ టీజర్‌ గొప్పగా ఏమీ లేదు. సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తంగా తరుణ్‌ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వడం కష్టమే అంటూ సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. తరుణ్‌ను దాదాపుగా ప్రేక్షకులు మర్చిపోయారు. ఇలాంటి సమయంలో మరోసారి తరుణ్‌ సినిమా ఎగబడి చూసే వారు ఉండరు. సినిమాలో మ్యాటర్‌ ఉంటే తప్ప ఆ సినిమా ఆడదు. కాని తరుణ్‌ ప్రస్తుత పరిస్థితి ఆశాజనకంగా లేదు. అందుకే సినిమా అనవసర ప్రయత్నం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply