వినోదపు పన్ను రాయితిలో శాతకర్ణి..!

100
Spread the love

Posted [relativedate]

bb1816బాలకృష్ణ 100వ సినిమాగా రాబోతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్రిష్ డైరక్షన్లో వస్తుంది. సినిమా అంచనాలకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్లో జరుగుతుంది. అయితే సినిమా బడ్జెట్ 60 కోట్ల దాకా లెక్క చెబుతున్నారు.

ఆ విధంగా చూసుకుంటే ప్రీ రిలీజ్ లోనే లాభాలు వచ్చేయాలి. ఇక దీనికి తోడు ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రత్యేకంగా వినోదపు పన్ను మినహాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపి సర్కార్ ఎలాగు బాలయ్య సినిమాకు పన్ను మినహాయిస్తుంది ఎటుకూడి తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా పన్ను మినహాయింపుపై చర్చలు జరుగుతున్నాయట. బాలయ్య స్వయంగా ఈ కార్యక్రమాలను చూస్తున్నాడట. ఇక సినిమా కూడా ప్రత్యేకంగా ఇద్దరు సి.ఎం ల కోసం జనవరి 3న స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయనున్నారట. రెండు రాష్ట్రాల్లో పన్ని మినహాయింపు కూడా వస్తే శాతకర్ణి సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here