టీడీపీ,తెరాస లో ముసలం పుడుతుందా?

0
433
tdp and trs party leaders are in shock

Posted [relativedate]
నియోజకవర్గాల పెంపు భరోసా ఇచ్చి ఆంధ్ర,తెలంగాణాలో అధికార పార్టీలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాయి.విపక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యాయి.ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది.కొత్త నియోజకవర్గాలు వచ్చేది లేదని కేంద్రం దాదాపుగా తేల్చేసింది.అటు కోర్టులు కూడా జంప్ జిలానీల విషయంలో షాక్ లు ఇస్తున్నాయి.

అన్నిటికన్నా ముఖ్యంగా అధికారమే పరమావధిగా పార్టీ మారిన నేతలు ఓ వైపు …పాత కాపులు మరోవైపు ఇక 2019 మీద దృష్టి పెడతారు.మాకు సీటు ఇస్తారా లేదా అని ఇప్పటి నుంచే అధిష్ఠానం ప్రాణాలు తోడేస్తారు.సహజంగానే హామీలు రాకపోతే ఇంకో ప్రత్యామ్న్యాయం చూసుకుంటారు.ఫలితంగా ఆపరేషన్ ఆకర్ష్ కి రివర్స్ గేరు పడుతుంది.అధికార పార్టీ నుంచి వలసలు మొదలవుతాయి.ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఈ వలసలు ఊపందుకుంటే పార్టీ కి నైతికంగా ఎంత దెబ్బో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఓ విధంగా చెప్పాలంటే నేతలే అధిష్టానాల్ని ఒత్తిడిలోకి నెడతారు.దీంతో రెండు రాష్ట్రాల్లో అధికారంలో వున్న టీడీపీ,తెరాస ల్లో ముసలం పుట్టొచ్చు..అయితే ఇద్దరు రాజకీయ దురంధరులు ఆ పార్టీలని నడిపిస్తున్నారు కాబట్టి ఏదో కౌంటర్ వ్యూహం వేస్తారని ఎక్కడో ఓ ఆశ…

Leave a Reply