శుద్ధి రాజకీయం కాదు శుద్ధ రాజకీయం ..

Posted [relativedate]

TDP and YCP Competition Protests in Andhra Pradesh
బుద్ధ ప్రవచనాలు..శాంతి మంత్రాలతో భాసిల్లిన అమరావతి ఇప్పుడు రణగొణ ధ్వనులు..రాజకీయ కేకలతో దిక్కులు పిక్కటిల్లుతోంది.ఈ రాజకీయ కాలుష్యం నుంచి ఆ ప్రాంతాన్ని ప్రక్షాళన చేద్దామంటే ఇప్పటికే అక్కడ శుద్ధి రాజకీయం మొదలైపోయింది.జగన్ అడుగు పెట్టిన నేల అపవిత్రం అయిందంటూ టీడీపీ శ్రేణులు పసుపు నీళ్లు చల్లుతూ ఆయన పర్యటించిన ప్రాంతమంతా పాదయాత్ర చేసేస్తున్నారు.దీంతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు సైతం పోటీగా శుద్ధి కార్యక్రమం మొదలెట్టింది.చంద్రబాబు పాదం మోపిన ప్రకాశం బ్యారేజ్ అపవిత్రం అయిందని వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.రెండు ప్రధాన పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పోలీసులకి వాళ్ళని కంట్రోల్ చేయడం తలకి మించిన భారం అవుతోంది.

ఈ శుద్ధి రాజకేయం చూస్తున్న వాళ్లకి మైండ్ బ్లాక్ అవుతోంది.రాజధాని ప్రాంతంలో సమస్యల ప్రస్తావనకు ప్రతిపక్ష నేత రావడాన్ని అధికార పక్షం ఈ స్థాయిలో వ్యతిరేకించడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తోంది.ఓ ప్రతిపక్షం చేయాల్సిన పనినే తప్పుబడితే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంటుంది? ఇక ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రభుత్వ విధానాల మీద అవగాహన ఉండి ఓ ఎకరానికి 15 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో రైతుల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం?వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇది శుద్ధి రాజకీయం కాదు …శుద్ధ రాజకీయం అని పక్కాగా చెప్పొచ్చు.

 

Leave a Reply