పవన్ తరపున టీడీపీ,వైసీపీ సర్వేలు?

153

Posted November 28, 2016, 11:34 am

chandrababu-reacts-on-jagan-pawan-kalyan-and-amaravati-issuesఎన్నికలు రెండున్నరేళ్లు ఉండగానే ఏపీ లో సర్వేల గోల మొదలైంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 52 సీట్లకే పరిమితమంటూ బ్రాహ్మణి జరిపిన సర్వేలో తేలిందంటూ వైసీపీ అభిమాన సోషల్ మీడియా లో ప్రచారం మొదలైంది.ఆ తరవాత వైసీపీ సర్వేలోనూ ఇదే వెల్లడి అయిందంటూ ఆ ప్రచారం జోరందుకుంది.దానికి బ్రేక్ వేయడానికన్నట్టు ఆంధ్రజ్యోతి తాజాగా మరో సర్వే చేసినట్టు ప్రకటించింది.టీడీపీ బలం అలాగే ఉందని…వైసీపీ బలహీనపడుతోందని ఆ సర్వే సారాశం.దీంతో మళ్లీ సర్వేల విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి.బహిరంగపరిచే సర్వే ల తీరు అలా ఉంటే …పార్టీ లు బయటికి వెల్లడించని సర్వే ల నిర్వహణ పెరిగింది.ఇందులో అధికార టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ చురుగ్గా వ్యవహరిస్తున్నాయి.తాజాగా ఆ రెండు పార్టీల సర్వేల్లో ప్రధాన ఫోకస్ పవన్ జనసేన మీదే ..ఆ పార్టీలు నిర్వహిస్తున్న సర్వేల్లోని కొన్ని ప్రశ్నలు ఇవే …

1 . జనసేన అధినేత పవన్ కి సీఎం అయ్యే సామర్ధ్యం ఉందా?
2 . జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే సత్తా ఉందా?
3 . వచ్చే ఎన్నికల్లో జనసేన బలపడితే ఏ పార్టీ కి నష్టం?
4 . జనసేన ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే మేలు జరుగుతుంది?
5 . జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఎవరికి ఓటేస్తారు?

ఇలా ఆ సర్వేల ప్రశ్నపత్రం చూస్తే ఎవరైనా ఇది జనసేన చేయిస్తుందేమో అనుకుంటారు .కానీ జనసేన ఇంకా పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించడం లేదు ..కేవలం శ్రేయోభిలాషులు,మేధావి వర్గం నుంచి సమాచారసేకరణకే పరిమితం అవుతోంది.అయితే ఆ పని జనసేన తరపున టీడీపీ ,వైసీపీ చేసేస్తున్నాయి.అందుక్కారణం వేరే చెప్పాలా?జనసేనతో తమలో ఎవరికి నష్టమో తెలుసుకోడానికి ఆ పార్టీలు ఆదుర్దా పడుతున్నాయి.ఒకటిరెండు సర్వేల తర్వాత గానీ జనసేనపై టీడీపీ ,వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటో తెలియదు.అప్పటిదాకా పవన్ పని బాబు,జగన్ చేసిపెడుతుంటారన్నమాట .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here