హోదా రేసులోకి టీడీపీ…

0
412

tdp bjp special status bill
రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లును మొదట్లో ఆషామాషీగా తీసుకొన్న దేశం తాజా పరిణామాలతో ఎలర్ట్ అయ్యింది .దేశవ్యాప్త చర్చకు దారితీసిన ఈ అంశంలో వెనకపడితే రాజకీయంగా తీవ్రనష్టం తప్పదని దేశానికి అర్ధమైంది .ఇక మౌనం తగదని నిర్ణయించుకొని లోక్ సభ లో ప్రత్యేక హోదా అంశం పై చర్చకు నోటీసు ఇచ్చింది .శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఈ నోటీసు ఇచ్చారు .కేవలం నోటీసుతో సరిపెట్టకుండా చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం .

బీజేపీ కూడా కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు ఆర్ధిక బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెడతారా అని ప్రశ్నిస్తోంది .అందుకనే దేశం లోక్ సభ ను ఎంచుకొంది .ఈ పోరాటం వల్ల హోదా వస్తే సరే…లేకున్నా రాజకీయంగా వెనకపడకుండా ఉంటామన్న టీడీపీ ఆలోచనను కమలనాధులు ఎలా తీసుకుంటారో ?

Leave a Reply