కమ్మోరికి రెడ్లు,కాపుల బుజ్జగింపు…ఇదే బాబు చిట్కా?

0
647
tdp chowdary leaders upset because of not get ministers post thats why reddy's do compromise them

Posted [relativedate]

tdp chowdary leaders upset because of not get ministers post thats why reddy's do compromise them
బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అచ్చు గుద్దినట్టు సరిపోయేలా వుంది.మరీ ముఖ్యంగా అధికార టీడీపీ కి అతికినట్టు సరిపోయేట్టుంది.పైకి ఒప్పుకున్నా లేకపోయినా టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ వారి హవా సాగుతుందని ప్రచారం ఉండనే వుంది.పార్టీ అధికారంలో వున్నప్పుడు ఇతర కులాలకు చెందిన నేతలు ఎవరైనా అసంతృప్తి చెందితే కమ్మ నాయకులు వారిని బుజ్జగించడానికి అధిష్ఠానం తరపున దౌత్యం నెరపడం ఎప్పటి నుంచో చూస్తున్నాం.అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది.మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డ వారిలో ఈసారి కమ్మ ఎమ్మెల్యేలే ఎక్కువగా వున్నారు.లోకేష్ కి తప్ప ఇంకో నాయకుడికి ఆ వర్గం నుంచి అవకాశం రాకపోవడంతో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఈసారి సముదాయింపుల బాధ్యత చూసే వారినే సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు టీడీపీ లో క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు పయ్యావుల కేశవ్,దూళిపాళ్ల నరేంద్ర ముందుండే వారు.మంత్రి పదవి రాలేదని వాళ్ళు ఇప్పుడు డీలా పడ్డారు.పార్టీకి దూరం కావాలని వారిమీద అనుచరులే ఒత్తిడి తెస్తున్నారు.ఈ పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దర్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి,మంత్రి అమర్నాథ్ రెడ్డి అనునయిస్తున్నారు.జేసీ స్వయంగా పయ్యావులతో మాట్లాడితే,అమర్నాధ్ రెడ్డి నరేంద్రతో భేటీ అయ్యి సముదాయించారు.ఇక గోదావరి జిల్లాల్లో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.తనకు మంత్రి పదవి రాకపోయినా పితానికి పదవి దక్కడం ఆయన్ని బాగా హర్ట్ చేసింది.దీంతో ఆయన సొంత పార్టీ పెడతాననే దాకా వెళ్లారు.కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈ నేతను కాపు వర్గానికి చెందిన టీడీపీ నేత బడేటి బుజ్జి సముదాయించారు. ఈ విషయాలన్నీ గమనించిన ఓ కమ్మ నేత ఇప్పుడు మంత్రి అయిన రెడ్డిగారి దగ్గర సరదాగా ఈ అంశాన్ని లేవనెత్తాడు. అంతే ఆ చౌదరిగారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఆ రెడ్డిగారు.తనకు ఎదురైన అనుభవాన్నే ఆ రెడ్డిగారు పంచుకున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఆ రెడ్డి గారు 2014 ఫలితాలు వచ్చాక చంద్రబాబుని కలిశారు.స్థానిక పరిస్థితుల వల్ల గెలవలేకపోయానని,కానీ సమీకరణాల రీత్యా మంత్రివర్గంలో తనకి స్థానం గురించి ఆలోచించాలని బాబుని అడిగారు.అంతే ఆయన అంతెత్తున ఎగిరిపడ్డారట.పార్టీ ని ఆదరించని జిల్లా,కులానికి ఎలా మంత్రి పదవి ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారట.కొంత కాలం గడిచింది.ఆ ఓడిన నేత ఎమ్మెల్సీ అయ్యాడు.ఇంకొంత కాలం గడిచింది ..అదే మనిషి మంత్రి అయ్యారు.వర్గాలు వారీగా,కులాలవారీగా రాజకీయాలు జరగవు.అవసరాలని బట్టి మాత్రమే వుంటాయని సదరు రెడ్డి గారు చేయడమే కాదు,కమ్మోరికి రెడ్లు,కాపుల బుజ్జగింపు బాబు చిట్కానే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారట.ఇంతా తెలిసాక కులం,కులం అని రొమ్ము విరుచుకునేవాళ్ళు బాబోయ్ రాజకీయం అని పరిగెత్తుకు వెళ్లరా?

Leave a Reply