టీడీపీ డాష్ బోర్డు ఎందుకు?

0
559
tdp dash board

tdp dash board

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సాంకేతికంగా కొత్తపుంతలు తొక్కుతోంది.డాష్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని శాఖల్లో వివిధ స్థాయిల్లో జరిగిన,జరుగుతున్న పనుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు తీసుకున్నారు .సీఎం చంద్రబాబు ఈ డాష్ బోర్డు గురించి పదేపదే చెబుతూ ఎమ్మెల్యేలు,అధికారుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.పాలనా పరమైన లోటుపాట్లను తెలుసుకునేందుకు వాడుతున్న డాష్ బోర్డు ను పార్టీ పరంగా కూడా ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయించింది.ఈ వ్యవహారాన్ని యువనేత లోకేష్ దగ్గరుండి చూసుకుంటుంటారట.

పార్టీ అధిష్ఠానం,అనుబంధ విభాగాలు,వాటికి సంబంధించిన కమిటీలు,సమావేశాలు,పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు అమలవుతున్న తీరు ….ఇలాంటి విషయాల్ని పరిశీలించేందుకు డాష్ బోర్డు ఉపయోగపడుతుందని లోకేష్ భావిస్తున్నారు.ప్రభుత్వ శాఖల్లో లాగే ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేలా ఓ వ్యవస్థని రూపొందిస్తున్నారు.అయితే ప్రస్తుతానికి ఈ డాష్ బోర్డు లోని సమాచారం చూసే అవకాశం పార్టీ హైకమాండ్ కి మాత్రమే ఉంటుంది.అంటే తమ్ముళ్లు వ్యవహారాలపై అధిష్టానం ఓ సాంకేతిక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసిందన్నమాట.

Leave a Reply