కమలానికి గులాబీ ఇస్తున్నది ఎవరు?

0
422

tdp giving rose flowers bjp

ప్రత్యేకహోదా ఉద్యమం ఊపందుకుంటున్న వేళ చిత్ర విచిత్ర దృశ్యాలు కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నాయి. కమలం నేతలకు గులాబీలు పంచుతున్నారు. ఆ గులాబీలు ఇస్తున్నది మిత్రులే కానీ … అవి ఇవ్వడం వెనక ప్రేమలేదు … నిరసన వుంది … ఈ చిత్రానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెరలేపారు.

రాష్ట్ర బీజేపీ నేతల మనసు మారాలని కోరుతూ ఆయన వారి కార్యాలయాల దగ్గరికి అనుచరులతో సహా వెళ్లారు. కేంద్రాన్ని ప్రత్యేకహోదాకి ఒప్పించాలని కోరుతూ అక్కడి కమలం నేతలకు గులాబీలు పంచారు. అక్కడి వీధులు ఊడ్చారు… బీజేపీ నేతల కార్లు తుడిచారు. ఈ వ్యవహారం అంతా చూసినవాళ్ళకి ‘ప్రేమలేని పూలు’ అన్న టైటిల్ స్ఫురిస్తోంది. ఏదైనా సినిమాకి వాడుకోవచ్చేమో … రైట్స్ మాత్రం బోండా ఉమని అడగాల్సిందే.

Leave a Reply