జగన్ ఆస్తుల జప్తు వెనుక తెలుగుదేశం ప్రమేయం ఉందా?

0
498
tdp in jagan property case

Posted [relativedate]

tdp in jagan property caseవై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల జప్తు వెనుక తెలుగుదేశం పార్టీముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందా ఈ డౌట్ వై ఎస్ ఆర్ పార్టీ నాయకుల తో పాటు అయన సో కాల్డ్ సపోర్టర్స్ అందరిలో ఉన్న అనుమానం అనిపిస్తోంది ఎందుకంటె వాళ్ళ మీడియా లో వాళ్ళ వెబ్ సైట్స్ లో ఇలా ప్రచారం చేసుకొంటున్నారు.అభిమానానికి హద్దు లేదు అది తెలిసిన విషయమే సరే అదలా ఉంచితే కాసేపు జరిగింది మాట్లాడుకొందాం. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసు లు ఎవరు పెట్టారు?ఎవరి హయాం లో కేసు లు కోర్ట్ వరకు వెళ్లి జగన్ సంవత్సరం శిక్ష అనుభవించాడు? దీనికి ఒకే ఒక్క ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ లో నిజమే కదా ఈ విషయన్ని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు.. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రమాదం లో చనిపోయిన తర్వాత అమాంతం ముఖ్యమంత్రి కావాలని ఆశించి చివరకి పిల్లకాకి కి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్న చందం గా కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు చిత్తై సోనియా గాంధీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకొన్నాడు..

ఆ తర్వాత కేసు లు ఓ ఏడాది జైలు జీవితం ఎంజాయ్ చేసి రాష్ట్ర విభజన కి కొంచెం ముందు మళ్ళీసమైక్య రాగం అందుకొని ఎన్నికల్లో మళ్ళీ భంగ పడిన విషయం తెలిసిందే ..ఈ తతంగం లో తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఏముంది రాజకీయ పార్టీ ల ప్రధాన ఉద్దేశ్యం ప్రజా సమస్యలపై పోరాటం అనేది తెలిసిందే..ఆ స్టాండ్ తీసుకొనే కదా ఏ పార్టీ అయినా పోరాటంచేసేది..తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ యంత్రాంగం స్పందించటంలో అర్ధం వుంది.

ఇటీవల అదే విషయాన్ని అధినేత దగ్గ ర ప్రస్తావించారు అక్రమాస్తుల కేసు నత్త నడక సాగుతోంది ప్రజల సొమ్ము వృధా అవుతోంది ఆని..తాజాగా అక్రమాస్తులే అని కోర్ట్ నిర్ధారిస్తూ జప్తు చేసుకొంటోంది దీంట్లో టీడీపీ పాత్ర ఉందని కేంద్రం ఈడీ చెప్పినట్టు వింటున్నాయని ఆ పార్టీ నాయకులూ ఫీల్ కావడం ఏ మేరకు వివేకం ఉన్న వారో వారికీ వారే తెలుసుకోవాల్సిన అవసరం వుంది.. ప్రభుత్వ సంస్థలు ఒక రికి లోబడి పని చేయవు అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులూ గుర్తించాల్సిన అవసరం వుంది.

Leave a Reply